Widgets


సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా song from Preminchukundam raa

 
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి (2)

పెదవి తాకి స్వాతిముత్యం పగడమయ్యిందా
తనువు తాకి శ్వేతపుష్పం అరుణమయ్యిందా
నీ ఒడి మన్మధ యాగ సీమ నీ సరి ఎవ్వరు లేరే భామ
నీ తోనే పుట్టింది ప్రేమా
కణ్వ శకుంతలే నీవా కావ్య సుమానివే నీవా
చల్లని వెన్నెల హాయిని వివరించేదెలా
వెచ్చని ఊహల వీణని వినిపించేదెలా
వాత్సాయన వనవాసినీ కావేరి
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా

సొగసు భారమోపలేక నడుము చిక్కిందా
జాలిగొన్న జాణతనమే జఘనమయ్యిందా
తుమ్మెద ఎరగని తేనె పువ్వా సౌందార్యానికి తావి నువ్వా
ప్రియమార దరిచేరరావా
సూర్య కిరీటమే నీవా చంద్ర సుమానివే నీవా
మౌన సరస్సున దాగిన హిమ శంఖానివో
తొలకరి మేఘ చాయలో మెరిసిన తారవో
వాత్సాయన వనవాసినీ కావేరి
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory