గాలినైపోతాను గగనానికి (2)
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికీ
గాలినైపోతాను గగనానికి
ఏడుకొండలకైనా బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే (2)
నీ కంటిలో నలక లోవెలుగునే కనక
నేను మేననుకుంటే యద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికి
రామపాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికీ
గాలినైపోతాను గగనానికి (2)
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో (2)
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ.. హరీ.. హరీ..
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికీ
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికీ








0 comments:
Post a Comment