Widgets


చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే song from Manmadhudu


చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడిరేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడిలేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకేదాకా ఆగదు నా కేక
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడిరేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా

కదలికే తెలియని శిలని కరిగించి ఓ ప్రేమా
కలయికే కల అని మాయమైపోకుమా
గతముగా మిగిలిన చితిని బతికించి ఓ ప్రేమా
చెరిపినా చెరగని గాయమైపోకుమా
మౌనమా అభిమానమా పలకవా అనురాగమా
ఒడిపోకే ప్రాణమా వీడిపోకుమా
అడుగడుగు తడబడుతు నిను వెతికి వెతికి కనులు అలిసిపోవాలా
చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే

నిలిచిపో సమయమా తరమకే చెలిని ఇకనైనా
చెలిమితో సమరమా ఇంతగా పంతమా
నిలవకే హృదయమా పరుగు ఆపొద్దు క్షణమైనా
నమ్మవేం ప్రణయమా అంత సందేహమా
వేరు చేసే కాలమా చేరువైతే నేరమా
దాడి చేసే దూరమా దారి చూపుమా
విరహాలే కరిగేలా జత కలిపి నడుపు వలపు కథలు తెరిచేలా



చెలియా చెలియా చెయిజారి వెళ్ళకే
సఖియా సఖియా ఒంటరిని చెయ్యకే
నడిరేయి పగలు చూడక సుడిగాలై వస్తా సూటిగా
ఎడబాటే బాటై రానా నీదాకా
పడిలేచే కెరటం తీరుగా దిశలన్నీ దాటే హోరుగా
నిను తాకేదాకా ఆగదు నా కేక


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory