అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
అలా అంటు నా చేయి ఒట్టేసేందుకే ఉంది
చెలి చూడు నా చేవ చుట్టేసేందుకే ఉంది
ముద్దొచ్చిన గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే
నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ
నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ
నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ
ఒక్కటయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ
నీ పూజకై వచ్చేందుకే వేవెల వర్ణాల పూలున్నవి
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది
మిల మిల మిల మిల ఉప్పెన నేనై వస్తా
నీ కళ కళ కళ కళ మోమును చూస్తు ఉంటా
ఘల ఘల ఘల ఘల మువ్వను నేనై వస్తా
నీకడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది
అలా అంటు నా చేయి ఒట్టేసేందుకే ఉంది
చెలి చూడు నా చేవ చుట్టేసేందుకే ఉంది

0 comments:
Post a Comment