Widgets

ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు song from Nenu

ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు

ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు
దరికి రానికా నింగి శశిరేఖా
పొదువుకోనీకా ఒదులుకోనీకా
ఇంతగా చితిమంటలా నన్నంటుకోవాలా
సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల
ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు

పాల నవ్వుల రూపమా నను తాళ నివ్వని తాపమా
దారి చూపని దీపమా జత చేరనియ్యని శాపమా (2)
తళ తళ తళ తళ కత్తుల మెరుపై కళ్ళను పొడిచేలా
తెరవని తలుపై తెలియని మలుపై కలవరపరిచేలా
నువ్వు నా సొంతమనే అత్యాశ అరిసేలా
నేనెంత ఒంటరినో ఒట్టేసి తెలిపేలా
జంట కాని జంట లా నా వెంట నడవాలా
సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల
ఎందుకు ఎందుకు ఎందుకు నను పరిగెత్తిస్తావెందుకు
ఆకలి తీర్చని విందుకు నన్నాకర్షిస్తావెందుకు

నీవు నింపిన ఊపిరే నా గుండె దహిస్తుంటే ఎలా
నీవు పెంచిన ఆశలే నరనరాన్ని కోస్తుంటే ఇలా (2)
సల సల మరిగే నిప్పుల మడుగై నెత్తురు ఉడికేలా
నిలువునా నీలో కరగని కోరిక విలవిల ఆడేలా
ఒక్క పుట్టుక లోనే ఇన్నిన్ని మరణాలా
ఎంత దగ్గరవున్నా దక్కదే వరమాలా
నన్నిలా ఉరి తాడుతో ఉయ్యాలలూపాలా
సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల
సౌందర్య జ్వాల సౌందర్య జ్వాల

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory