 
 ఘాటు ఘాటు ప్రేమా ఈ ఘాటు చాలదమ్మా
నీకు నాకు నడుమా ఈ దూరమేమిటమ్మా
చేరాముగా ఒకే దరి ఈ చేరువ సరిపోదే మరి
నాలో నువ్వై నీలో నేనై ఇంకా ఇంకా ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలీ…
ఘాటు ఘాటు ప్రేమా ఈ ఘాటు చాలదమ్మా
నీకు నాకు నడుమా ఈ దూరమేమిటమ్మా…
చూడూ.. నిను చూసిన కొద్దీ చూడనిదేదో
చూడాలంటూ బ్రతిమాలుతుంది వయసు
చెప్పు.. అని పలికినకొద్దీ చెప్పందేదో
చెప్పాలంటూ చెలరేగుతుంది మనసు
నా పసిడి ప్రాయాలు ఒంపినా…
నా పట్ట పగ్గాలు తెంపినా…
నువ్వో సగమై నేనో సగమై
ఇద్దరమొకటై ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలీ…
ఘాటు ఘాటు ప్రేమా ఈ ఘాటు చాలదమ్మా
నీకు నాకు నడుమా ఈ దూరమేమిటమ్మా…
ముద్దు.. నువ్వు పెట్టినకొద్దీ దాహం పెరిగి
లావా ద్రవమై నను కాచుతుంది ఒట్టు
పట్టు.. నువ్వు పట్టినకొద్దీ మత్తుగ నాలో
కమ్మిన మైకం ఎక్కింది ఆఖరి మెట్టు
కౌగిళ్ళ లోగిళ్ళు చేరినా…
సరసాల శిఖరాలు తాకినా..
నువ్వే నేనై నేనై నువ్వై నువ్వు నేను ఉండాలంటే
ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలీ…
ఘాటు ఘాటు ప్రేమా…నీకు నాకు నడుమా…
 
 

 
 
 
 
 








0 comments:
Post a Comment