
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ఉబికి వస్తుంటే సంతోషం
అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనో, నా వెనుక తానో
ఎంత వరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ఉబికి వస్తుంటే సంతోషం
అదిమిపెడుతోందే ఉక్రోషం
తన వెనుక నేనో, నా వెనుక తానో
ఎంత వరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం
ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం
అది ఏదో చెప్పనంటోంది నా మౌనం
ముల్లులా బుగ్గను చిదిమిందా
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏం విందో వయసుకేమి తెలిసిందో (2)
ఆదమరపో… ఆటవిడుపో… కొద్దిగా నిలబడి చూద్దాం… ఓ క్షణం
అంటే కుదరనంటోంది నా ప్రాణం
కాదంటే ఎదురు తిరిగింది నా హృదయం
మెల్లగా సిగ్గును కదిపిందా
వానలా మనసును తడిపిందా
వీణలా తనువును తడిమిందా
చిలిపి కబురు ఏం విందో వయసుకేమి తెలిసిందో (2)
ఆదమరపో… ఆటవిడుపో… కొద్దిగా నిలబడి చూద్దాం… ఓ క్షణం
అంటే కుదరనంటోంది నా ప్రాణం
కాదంటే ఎదురు తిరిగింది నా హృదయం







super song
ReplyDelete