Widgets


ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు song from Sontham

ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా (2)
అరెరె ఎన్నడూ ఈ రంగులు నేను చూడనే లేదే
ఎగిరే ఊహలు ఈ వింతలు నాకు ఎదురు కాలేదే మనసా ఆ ఆ
ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా
ప్రేమ అంటే ఎమిటంటే తెలిసే దాక తెలియదంతే
ఎవ్వరైనా ఎవరికైనా చెప్పలేని వింతే
ఎంతమాత్రం నమ్మనంటూ నాలో నేను నవ్వుకుంటే
నన్ను సైతం వదలనంటూ వచ్చి కమ్ముకుందే
కథలు విన్నా ఎదరే ఉన్నా అసలు సంగతి తేలదుగా
అనుభవంతో చెబుతూ ఉన్నా రుజువు నేనేగా
ఈనాటి వరకు నా గుండె లయకు ఈ వింత పరుగు ఇంత ఉరుకు లేనే లేదే ఏంటిలా
ఒక్కచోటే కలిసి ఉన్నా తనతో పాటు ఇంత కాలం
ఒక్క పూట కలగలేదే నాకిలాంటి భావం
ఇప్పుడేగా తెలుసుకున్నా ఎగిరొచ్చాక ఇంత దూరం
ఎక్కడున్నా ఆమె కూడా పక్కనున్న సత్యం
కంట పడని ప్రాణం లాగా గుండె లోనే తానున్నా
జ్ఞాపకాలే తరిమే దాకా గుర్తు రాలేదే
ఈ తీపిదిగులు మొదలైంది మొదలు ఎన్నెన్ని కలలు పట్టపగలు పుట్టుకొస్తుంటే ఎలా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory