
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే(2)
మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
పగలే రేయైన యుగమే క్షణమైన కాలం నీ తొటీ కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో ఉండాలని ఉన్నదీ వద్దని సిగ్గాపుతున్నదీ
తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కళ్ళలో నిద్రించీ కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచనే నా ఊపిరీ నీకై నిలిచనే
చావుకు భయపడనే నువ్వుంటె చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే యద చాటు మాటు గానం కనులే కలిపే ఈ వేళ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
0 comments:
Post a Comment