Widgets


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే.. చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే.. song from Siva putrudu

 http://www.idlebrain.com/images1/newpg-sivaputrudu3.jpg


చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
చిరుగాలి వీచెనే.. చిగురాశ రేపెనే..
వెదురంటి మనసులో.... రా..గం వేణువూదెనే
మేఘం మురిసి పాడేనే..
కరుకైన గుండెలో.. చిరుజల్లు కురిసినే..
తనవారి పిలుపుతో.. ఆ..శలు వెల్లువాయనే
ఊ..హలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూ..సి మది చిందులేసెనే
చిలిపి తాళమే..సి చెలరేగి పోయెనే
తుళ్ళుతున్న చిన్న సెలయే..రు గుండెలోన పొంగి పొలమా..రు
అల్లుకున్న ఈ.. బంధమంతా వెల్లువైనదీ.. లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే నేలతల్లి వంటి మనసల్లే
కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది
నీ..కు తోడు ఎవరంటూ లే..రు గతములో
నే..డు చెలిమిచెయ్ చాపే వా..రే బ్రతుకులో
కలిసిన బంధం. కరిగిపోదులే.
మురళి మోవి విరిని తావి కలిసిన వేళా...
మనసున వింత ఆకా..శం మెరుపులు చిందె మనకో..సం
తారలకే తళుకుబెళుకా ప్రతి మలుపు ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదో..ట కోవెల వడి చేరే..నా
రుణమేదో మిగిలి ఉంది ఆ తపనే తరుముతోంది
రో..జూ ఊయలే ఊగే రా..గం గొంతులో
ఏ..వో పదములే పాడే మో..హం గుండెలో
ఏ...నాడూ. తోడు లేకనే .
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే...


To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory