Widgets


విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ....మ్....... song from Sirivennela

 

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ....మ్.......
ప్రాణనాధులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓ....మ్.......
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం...... ఆ......

సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ... గీ...తం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఘ తంతుల పైనా
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైనా
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఘ తంతుల పైనా
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైనా
పలికిన కిలకిల ధ్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాదా
విశ్వకార్యమునకిది భాష్యముగా
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వర సుర ఝరీగమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ... గీ...తం  

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory