
ఓం.... ఓం....
ఓం.. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకి రాయని కథగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
రామ్.. రామ్.. రామ్.. రామ్..
రామ నామ జీవన నిర్నిద్రుడు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోర తపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
సాస సాని దని సానిదామ గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడు
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖ చక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సహితుడై
కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యమునిమ్మని కోరె భద్రుడు
వామాంకస్థిత జానకీ పరిలసత్
కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే
శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఓం.. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
ఏ వాల్మీకి రాయని కథగా
సీతారాములు తనపై ఒదగా
రామదాసకృత రామపదామృత
వాగ్గేయస్వర సంపదగా
వెలసిన దక్షిణ సాకేతపురి
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
రామ్.. రామ్.. రామ్.. రామ్..
రామ నామ జీవన నిర్నిద్రుడు
పునర్దర్శనము కోరిన భద్రుడు
సీతారాముల దర్శనానికై
ఘోర తపస్సును చేసెనప్పుడు
తపమును మెచ్చి ధరణికి వచ్చి
దర్శనమిచ్చెను మహావిష్ణువు
సాస సాని దని సానిదామ గమ పాదనీ దామపా
త్రేతాయుగమున రామరూపమే
త్రికరణశుద్దిగ కోరెను భద్రుడు
ఆదర్శాలకు అగ్రపీఠమౌ
ఆ దర్శనమే కోరెనప్పుడు
ధరణీపతియే ధరకు అల్లుడై
శంఖ చక్రములు అటు ఇటు కాగా
ధనుర్బాణములు తనువై పోగా
సీతాలక్ష్మణ సహితుడై
కొలువు తీరె కొండంత దేవుడు
శిలగా మళ్ళీ మలచి
శిరమును నీవే నిలచి
భద్రగిరిగ నను పిలిచే
భాగ్యమునిమ్మని కోరె భద్రుడు
వామాంకస్థిత జానకీ పరిలసత్
కోదండ దండం కరే
చక్రంచోర్థ్వ కరేణ బాహుయుగళే
శంఖం శరం దక్షిణే
విఘ్రాణం జలజాతపత్ర నయనం
భద్రాద్రి మూర్తిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం
సౌమిత్రి యుక్తం భజే
అదిగో అదిగో భద్రగిరీ..
ఆంధ్రజాతికిది అయోధ్యాపురి
0 comments:
Post a Comment