Widgets


నిన్ను కోరీ వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం song from Gharshana 1988

 

నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

ఉడికించే చిలకమ్మ నిన్నూరించే
ఒలికించే అందాలే ఆలాపించే
ముత్యాలా బంధాలే నీకందించే
అచ్చట్లు ముచ్చట్లు తానాసించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే
ఉండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం

ఈ వీణా మీటేది నీవేనంట
నా తలపు నా వలపు నీదేనంట
పరువాల పరదాలు తీసే పూట
కలవాలి కరగాలి నీలోనంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం కానీ రాగ సంగమం
నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఈ వేళ సరసకు
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం
ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలి మది విరిసేనే
రవి కుల రఘు రామ అనుదినము
నిన్ను కోరీ వర్ణం వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory