Widgets


మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా song from Munna


 


మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా....
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా....
ఓ సోనా వెన్నెల సోనా నేనిట్టా నువ్వయ్యానా
నీ రూపు రేఖల్లోనా నేనుండి వెలుగైపోనా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా
నా చిత్రం చిత్రించేయనా కనుపాపై పోనా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా....

నీవే తోడని నిజంగా... నీలో చేరితి క్రమంగా...
నీవుంటే ఒక యుగమే... ఐపోయే ఇక క్షణమే...
తెలుసా తెలుసా ఇది తెలుసా... మార్చేశావే నా ఈ వరసా...
నువ్వు మర్చేశావే నా ఈ వరసా....
ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి జాణా
చెక్కిలిలో చుక్కైపోనా చూపుల్తో చుట్టేసేనా
ఓ సోనా వెన్నెల సోనా ముంగిట్లో ముగ్గై రానా
ముద్దుల్తో ముంచేసేనా కౌగిలికే రానా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా
ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా....

కూసే కోయిల స్వయంగా... వాలే వాకిట వరంగా...
నీ ఊసే అది తెలిపే... మౌనంగా మది మురిసే...
కలిశా కలిశా నీతో కలిశా... నీలో నిన్నే అన్నీ మరిచా...
హో... నీలో నిన్నే అన్నీ మరిచా...
ఓ సోనా వెన్నెల సోనా నీ వైపే వచ్చానమ్మా
నీ ఊహే కన్నానమ్మా నా ఊసే పంపానమ్మా
ఓ సోనా వెన్నెల సోనా నీ గుండె చప్పుళ్ళోనా
నా ప్రాణం నింపానమ్మా నిను చేరానమ్మా
మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ.. మనసే నీకేదో చెప్పాలందమ్మా
నిన్నా మొన్నా ఈ వైనం నాలో లేదమ్మా...
ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా....
ఓ సోనా వెన్నెల సోనా నేనిట్టా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా
ఓ సోనా వెన్నెల సోనా నేనిట్టా నువ్వయ్యానా
ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory