
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకీ...
హే.. నిదురదాటి కలలే పొంగే
పెదవి దాటి పిలుపే పొంగే
అదుపు దాటి మనసే పొంగే నాలో
గడప దాటి వలపే పొంగే
చెంప దాటి ఎరుపే పొంగే
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకీ...
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
తలపు దాటి తనువే పొంగే
సిగ్గు దాటి చనువే పొంగే
గట్టు దాటి వయసే పొంగే లోలో
కనులు దాటి చూపే పొంగే
అడుగు దాటి పరుగే పొంగే
హద్దు దాటి హాయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికీ...
0 comments:
Post a Comment