Widgets


ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు song from Darling

 

ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలో నీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
పద పద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

మేఘాల ఒళ్లోనే ఎదిగిందని జాబిల్లి చల్లేనా జడివానని
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామని
నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే మారినా తీరులో మారునా మారదూ.. ఆ ప్రాణం
పద పద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు

వెళ్ళెళ్ళు చెప్పేసెయ్ ఏమవ్వదు లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా
హాయినే పొందడం భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా ఇప్పుడే... ఆ అందం
పద పద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటికి తేరా చొరవా చొరవా
ఇంకా ఏదో ఇంకా ఏదో ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు ఎదే చేరాలి ఈరోజే చెలి చెంతకు
తనలోనీ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory