
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలమూ.... గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానమూ.... నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపె తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు
అనుకుంటు ఉంటాను మ్మ్..హూ...............
0 comments:
Post a Comment