
ఓ.. హలో హలో హలో లైలా మాయ మైంది నా మనసు నీవల్లా
ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళముందె దాగి ఉంది పగటి పూట తారలా
హలో హలో హలో చాలా చేసినావు చాలులేర గోపాలా
నాలోనే దాచి పెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకలా
ఐతే.. నా మనసు నిన్ను చేరినట్టు నీకు కూడ తెలిసినట్టే
ఐనా ముందు అడుగు వేయకుండ ఆపుతావు అదేమిటే
పెదాలతో ముడెయ్యనా ప్రతీక్షణం అదేపనా
ముద్దుదాక వెళ్ళనిచ్చి హద్దు దాటనియ్యవేంటి
కావాలమ్మ కౌగిలి కౌగిలి చెలీ చెలీ
కొద్దిపాటి కౌగిలిస్తె కొత్తదేదొ కోరుకుంటు
చేస్తావేమో అల్లరి అల్లరి మరి మరీమరి
అమ్మో నా లోపలున్నదంత అచ్చు గుద్దినట్టు చెప్పినావే
అవునోయ్ నీకంతకన్న గొప్ప ఆశ ఇప్పుడైతే రానే రాదోయ్
అందాలతో ఆటాడనా అనుక్షణం అదేపనా
హలో హలో హలో లైలా మాయ మైంది నా మనసు నీవల్లా
ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళముందె దాగి ఉంది పగటి పూట తారలా
ఒక్కసారి చాలలేదు మక్కువంత తీరలేదు
ఇంకోసారి అన్నది అన్నది మది మదీమది
ఒడ్డు దాకె హద్దు నీకు లోతుకొచ్చి వేడుకోకు
నీదే పూచి నీదిలే నీదిలే భలే భలేభలే
ఆ మాత్రం సాగనిస్తె చాలునమ్మ సాగరాన్ని చుట్టిరానా
నీ ఆత్రం తీరిపోవు వేడుదాక తీరమైన చూపిస్తానా
సుఖాలలో ముంచెయ్యనా క్షణక్షణం అదేపనా
హలో హలో హలో లైలా మాయ మైంది నా మనసు నీవల్లా
ఏమైందో ఎక్కడున్నాదో కళ్ళముందె దాగి ఉంది పగటి పూట తారలా
0 comments:
Post a Comment