ప్రేమా..... ప్రేమా..... ఆ....... ప్రేమా.... ప్రేమా...
నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా.... ఆ...
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా.... ప్రేమా....
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ...
రావా నా వాకిట్లో... నీకై నే వేచానే...

ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా
నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో నే నిలుపుకున్నా
కరుణించలేవా సుకుమారి
నా గుండె లోతుల్లో దాగుంది నీవే
నువు లేక లోకంలో జీవించలేనే
నీ ఊహతోనే బ్రతికున్నా......
నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా.... ఆ...
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా.... ప్రేమా....
నిముషాలు శూలాలై వెంటాడుతున్నా
ఒడి చేర్చుకోవా వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా
ఓదార్చిపోవా ఓసారి
ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ
ప్రేమించినానంటూ బ్రతికించలేవా
అది నాకు చాలే చెలీ......
నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా.... ఆ...
నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే
నేనున్న సంగతే మరిచిందే ప్రేమా.... ప్రేమా....
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ...
రావా నా వాకిట్లో... నీకై నే వేచానే...
నను నేనె మరచినా నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు
వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా.... ఆ...
0 comments:
Post a Comment