Widgets


లలిత ప్రియ కమలం విరిసినది song from Rudraveena

 


లలిత ప్రియ కమలం విరిసినది
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ......
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఆ.......
ఉదయ రవి కిరణం మెరిసినది
అమృత కలశముగ ప్రతి నిమిషం
అమృత కలశముగ ప్రతి నిమిషం కలిమికి దొరకని
చెలిమిని కురిసిన అరుదగు వరమిది
లలిత ప్రియ కమలం విరిసినది
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిల కిల తీగ సొగసుల తొణికిన మిల మిల
పాడుతున్నది ఎద మురళి రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ......
ఉదయ రవి కిరణం మెరిసినది
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజా కుసుమం
మనసు హిమగిరిగా మారినది
మనసు హిమగిరిగా మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం వ్రాయమని మాయని మధు కావ్యం
స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనే వడివడి పరువిడి
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని ఆ.....
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని ఆ......
లలిత ప్రియ కమలం విరిసినది 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory