
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
నా కన్నుల్లోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే... చిన్నారి
ఈ అనుభవమే... నాకు తొలిసారి
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
నిన్ను చూస్తే నిన్న లేని
చలనం నాలోనా.. నాలోనా
కన్ను మూస్తే నిన్ను కలిసే కలలే ఓ లలనా
ఎందుకో నా గుండెలోన
ఏదో హైరానా.. హైరానా
ఎంతమంది ఎదుట ఉన్నా ఒంటరినౌతున్నా
ఈ అల్లరి నీదేనా నను అల్లిన తిల్లానా
అనుకున్నాన మరి నాలోన
ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని
(అందం అందం)
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు
మెరుపులాంటి సొగసులెన్నో
నన్నే చూస్తున్నా.. చూస్తున్నా
నేను మాత్రం నిన్ను చూస్తూ కలవరపడుతున్నా
ఊహలన్నీ వాస్తవాలై
నీలా మారేనా.. మారేనా
ఊపిరేదో రూపమైతే అది నీవే మైనా
ఆ దైవం ఎదురైనా ఈ భావం నిలిపేనా
అనుకున్నాన మరి నాలోన
ఈ నమ్మని కమ్మని కథ మొదలౌనని
(అందం అందం)
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు (ఎవరే నువ్వు)
నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు (నీ చిరునవ్వు)
నా కన్నుల్లోన నీ రూపం
నాకన్నా ఎంతో అపురూపం
అనిపించే... చిన్నారి
ఈ అనుభవమే... నాకు తొలిసారి
0 comments:
Post a Comment