Widgets


ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు రాలు పూల దండలు song from Geethanjali




ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మేడలు రాలు పూల దండలు
నీదో లోకం నాదో లోకం
నింగీ నేల తాకేదెలాగ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఏల గాలి మాటలు మాసిపోవు ఆశలు
నింగీ నేల తాకే వేళ
నీవే నేనై పోయే వేళాయె
నేడు కాదులే రేపు లేదులే
వీడుకోలిదే వీడుకోలిదే

నిప్పులోన కాలదూ నీటిలోన నానదూ
గాలిలాగ మారదూ ప్రేమ సత్యము
రాచవీటి కన్నెదీ రంగు రంగు స్వప్నమూ
పేదవాడి కంటిలో ప్రేమ రక్తమూ
గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురులేదు ప్రేమకూ
రాజ శాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ
సవాలుగా తీసుకో ఓ.. ఈ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా

కాళిదాసు గీతికీ కృష్ణ రాస లీలకీ
ప్రణయమూర్తి రాధకీ ప్రేమ పల్లవీ
ఆ అనారు ఆశకీ తాజమహల్ శోభకీ
పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ
నిధి కన్నా ఎద మిన్న గెలిపించు ప్రేమనే
కథ కాదు బ్రతుకంటే బలికానియ్ ప్రేమనే
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా
జయించేది ఒక్కటే ఓ.. ఈ ప్రేమ
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
కాలమన్న ప్రేయసీ తీర్చమందిలే కసి
నింగీ నేల తాకే వేళ
నీవే నేనై పోయే క్షణాన
లేదు శాసనం లేదు బంధనం
ప్రేమకే జయం ప్రేమదే జయం 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory