Widgets


రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం song from Mahatma

 


రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరత మాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమ యాతన తీర్చిన వరదాతరా గాంధీ
ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవద్దూతా... అపురూపం ఆ చరితా...
కర్మ యోగమే జన్మంతా ధర్మక్షేత్రమె బ్రతుకంతా...
సంభవామి అని ప్రకటించిన అలనాటి క్రిష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాతా...
మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్పూర్థి
సత్యాహింసల మార్గజ్యోతీ.. నవ శకానికే నాందీ...
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేతా... సిసలైన జగజ్జేతా...
చరఖా యంత్రం చూపించి స్వదేశి సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడుర జాతిపితా... సంకల్ప బలం చేతా..
సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతీ...
తూరుపు తెల్లారని నడిరాత్రికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతీ...
పదవులు కోరని పావన మూర్తీ... హృదయాలేలిన చక్రవర్తీ...
ఇలాంటి నరుడొక ఇలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి
సర్వ జన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాల్ని అంతం చేసేందుకే
నా ఆయువంతా అంకితం హే.. రామ్

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory