Widgets


ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు song from Gamyam





 

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు
ప్రశ్నలోనే బదులు ఉంటే గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరకు
ప్రశ్నలోనే బదులు ఉంటే గుర్తుపట్టే గుండెనడుగు

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరూ...
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ....
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో.. లేదా.. గాలీ.. వెలుతురు నీ చూపుల్లో .. లేదా...
మన్నూ మిన్నూ.. నీరూ.. అన్నీ.. కలిపితె నువ్వే కాదా.. కాదా..
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలూ నిజాల సాక్ష్యాలే....
శత్రువులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులూ నీ భావ చిత్రాలే...
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుటక చావూ... రెండే.. రెండు నీకవి సొంతం కావూ.. పోనీ..
జీవిత కాలం నీదే.. నేస్తం రంగులు ఏంవేస్తావో.. కానీ..
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory