Widgets


ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ song from Manasulomata

 

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
సంగీతమంటె ఏవిటో తెలిసి ఉండాలి మనకి ముందుగా
అంత సందేహముంటె తీర్చుకో గురువులున్నారు కనుల ముందుగా
వెళ్ళి నీలి మేఘాన్ని గాలి వేగాన్ని నింగి మౌనాన్ని అడగరా
కడలి ఆలపించేటి ఆ తరంగాల అంతరంగాన్ని అడగరా
మధుర ప్రాణ గీతాన్ని పాడుతూ ఉన్న
ఎద సడినడిగితె శృతి లయ తెలుపద
బ్రతుకును నడిపిన సంగతి తెలియద

ఏ రాగముంది మేలుకొని ఉండి లేవనంటున్న మనసును పిలువగ
ఏ తాళముంది సీసమును పోసి మూసుకొని ఉన్న చెవులను తెరువగ
ఏ సుప్రభాత గళముతో నేల స్వాగతిస్తుంది తొలి తొలి వెలుగుని
ఏ జోలపాట చలువతో నింగి సేదతీర్చింది అలసిన పగటిని
స్వర్ణ తరుణాలు చంద్ర కిరణాలు
జిలుగులొలికి బదులు పలుకునెవరికి
మంచు మౌనాలు పంచమంలోన
మధువు చిలుకు ఎవరి చెలిమి రవళికి

తోటలో చేరి పాట కచ్చేరి చేయమంటున్న వినోదమెవరిది
నేల అందాల పూల గంధాల చైత్ర గాత్రాల సునాదమెవరిది
పంచ వర్ణాల పింఛమై నేల నాట్యమాడేటి వేళలో మురిసి
వర్ష మేఘాల హర్ష రాగాలు వాద్యమయ్యేటి లీలలో తడిసి
నీరుగా నీరు ఏరుగా ఏరువాకగా నారు చిగురులు తొడగగ
పైరు పైటేసి పుడమి పాడేటి పసిడి సంక్రాంతి పదగతులెవరివి
ఆరు కాలాలు ఏడు స్వరములతొ అందజేస్తున్న రసమయ మధురిమ
వినగల చెవులను కలిగిన హృదయము
తన ప్రతి పదమున చిలకద సుధలను

జోహారు నీకు సంద్రమా ఎంత ఓపికో అసలు అలసట కలగద
ఓహోహొ గాన గ్రంథమా ఎంత సాధనుందిశల ఎదలకు తెలియద
నీ గీతమెంత తడిమినా శిలలు సంగీత కళలు కావవీ
ఎంత నాదామృతాన తడిసినా ఇసుక రవ్వంత కరగలేదనీ తెలిసి
అస్తమిస్తున్న సూర్యతేజాన్ని కడుపులో మోసి నిత్యమూ కొత్త
ఆయువిస్తున్న అమృతంలాంటి ఆశతో ఎగసి ఆవిరై
అష్ట దిక్కులూ దాటి మబ్బులను మీటి
నిలువున నిమిరితె గగనము కరగద
జల జల చినుకుల సిరులను కురవద
అణువణువణువున తొణికితె స్వరసుధ
అడుగడుగడుగున మధువని విరియదా... 




0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory