Widgets


అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే song from Venki



అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా
ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా
అది ఒకటే చిరునవ్వేనమ్మ
అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
హే..ల్లా హేల్లాల జాబిలి కంట్లో కన్నీళ్ళా
హే..ల్లా హేల్లాల వెన్నెల కురవాలా
బాధలో కన్నులే కందినంత మాత్రాన
పోయినా కాలమూ పొందలేముగా
రేగినా గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా
అరె ఈ నేల ఆకాశం ఉందే మనకోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం
అనగనగా కథలా ఆ నిన్నకు సెలవిస్తే
అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
హే..ల్లా హేల్లాల హేల్లే లాల్లల లాల్లాల్ల
హే..ల్లా హేల్లాల హేల్లే లాల్లాల్లా
ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా
నా ఎద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు
ఎన్నడు నీడగా వెంట ఉండవా
హే.. కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి
కలిపేస్తూ నీ చెయ్యి అడుగే చిందెయ్యి
మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి
హే..ల్లా హేల్లాల హేల్లే లాల్లల లాల్లాల్ల
హే..ల్లా హేల్లాల హేల్లే లాల్లాల్లా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory