
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాకా నిలువవె కడదాకా
జీవంలో ఒదగవె ఒంటరిగా
లో లో ముగిసే మౌనంగా
ఓ...... ఓ... ఓ..ఓ.ఓ.....
ఓ...... ఓ... ఓ..ఓ.ఓ.....
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
ఊహలలోకంలో ఎగరకు అన్నావే..
తేలని మైకంలో పడకని ఆపావే..
ఇతరుల చిరు నవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా..
తెలవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడూ..
చల్లని చూపులతో దీవెనలిస్తాడూ..
అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమౌతాడూ..
చెంతకి చేరాడంటే చితి మంటే ఔతాడూ..
హాలాహలం నాకు సొంతం నువు తీసుకో అమృతం
అనుకుంటె ఆ ప్రేమ ప్రేమ కాగలద ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
0 comments:
Post a Comment