
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో జడ కుచ్చుల్లోన మల్లెవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో....
మధుమాసంలోన మంచు పూల జల్లువో....
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఈ పరిమళము నీదేనా నాలో పరవశము నిజమేనా
బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్నాలాగు మరి నీ వైపు
సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా
వింతల్లోను కొత్త వింత నువ్వేనా...
ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన (హుహు..)
ఆ పలుకులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం
ఆ మబ్బు చీర పంపుతోంది మోజు పడి నీకోసం
స్వరముల తీపి కోయిలా ఇలా పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం
ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో నువ్వు అచ్చుల్లోన హల్లువో
జడ కుచ్చుల్లోన మల్లెవో జడ కుచ్చుల్లోన మల్లెవో
నువ్వు అచ్చుల్లోన హల్లువో జడ కుచ్చుల్లోన మల్లెవో
కరిమబ్బుల్లోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో.....
మధుమాసంలోన మంచు పూల జల్లువో.....
మధుమాసంలోన మంచు పూల జల్లువో..
(మంచు పూల జల్లువో....)
0 comments:
Post a Comment