నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా
అగ్గి దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి ఎన్నెల్లొ కళ్యాణం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చతెలుగు పుచ్చపూల పున్నమేనులే.. ఓ...
రెల్లుకప్పు నేసిన ఇంద్రధనుసు గూటిలో
రేయి పగలు ఒక్కటేలే రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు
ఆ దిక్కులే మన ఆస్థులు
సల్లగాలుల పల్లకీలలో
సుక్క సుక్కనీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాములే
వర్జమంటు లేదులే రాహుకాలమేదిలే
రాశి లేదు వాసి లేదు తిథులు లేవులే.. ఓ...
అతిథులంటు లేరులే మనకు మనమె సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే
ఏ ఏలుపు దిగి రాదులే
మన కూడికే మన తోడులే
ఇసుక దోసిలే తలంబ్రాలుగా
తలలు నింపగా మనువు జరిగెలే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
లా ల లా లా ల లా లా లా..
లా ల లా లా ల లా లా లా..
0 comments:
Post a Comment