
చిట్టి చిట్టి పులకింతా... చిత్రంగ తనువంతా...
చేశావు నాలో గోరంత గిలిగింతా..
ఉంటె నువ్వు నా చెంతా... జన్మంత కేరింతా...
రేపావు ఎదలో కొండంత కవ్వింతా..
నీ జతే... కలిసెనా... ఇక నా ఎదకే కలుగును పరవశమంతా
నువ్వు ఏవో ఏవో వర్ణాలనే నింపావు నా కంటిలో
కళ్ళు తెరిచే లోగా వలపై ఇలా నిండావు నా గుండెలో
మన రేపటి పయనం... మహ సుందర స్వప్నం...
ఓ వెల్లువల్లె నాలో ప్రేమే పొంగిపోయెలే
తొలి కన్నె సిగ్గు సందె వేళ పున్నమాయెలే
పోయెలే... లోకమే... హాయిలే...
ఆ దైవం అరెరే మా హృదయమే మైనంతొ చేశాడులే
ఆ మైనం మగువను చూడంగనే కరిగించి వేశాడులే
ఈ మౌన సరాగం మన ఇరువురి సొంతం
నీ శ్వాసా ధ్యాసా నన్నే తాకి చుట్టమాయెలే
నీ అందమైన జ్ఞాపకాలు చుట్టూ మూగెనే
మూగెనే... మువ్వలై... మోగెనే...
చిట్టి చిట్టి పులకింతా... చిత్రంగ తనువంతా...
చేశావు నాలో గోరంత గిలిగింతా...
0 comments:
Post a Comment