Widgets


సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు song from Yamaleela


సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటి పొటి పలుకుల ముద్దు మాటలే మా ధన ధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసి కూనా...
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్ళూ...
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు

నాలో మురిపెమంతా పాల బువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చ లేని చందమామే నువ్వనీ
ఊరూ వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లె కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లె చేరుకోనీ
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటి పొటి పలుకుల ముద్దు మాటలే మా ధన ధాన్యాలు

వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువు అణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ రుణమే తీరగా
తోడుండగా నను దీవించె కన్న ప్రేమా
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటి పొటి పలుకుల ముద్దు మాటలే మా ధన ధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసి కూనా...
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహరాజులా జీవించాలి నిండు నూరేళ్ళూ...
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory