పరువము వెల్లివిరిసెలే
పేరెరుగని పక్షి పిలిచెలే
మనసు ఎగిసెలే
హృదయము హొయ్.. ముసిగా మురిసెలే
పరువపు వాన కురిసెలే
పరువము నాలో విరిసెలే
పేరెరుగని పక్షి పిలిచెలే
మనసు ఎగిసెలే
హృదయము ముసిగా మురిసెలే
కలలో నువ్వే నాకు కనిపించగా
నా కళ్ళే నిను బంధించేసే
నీ శ్వాసలే నను స్పర్శించగా
నీవున్న చోటు నాకు తెలిసే
తెలిసి తెలియని కవిత
అర్ధం మొత్తం నేడు తెలిసే
చేజారిపోయిన గొడుగై
గాలుల్లో నా తనువెగిసే
వానగాలుల్లో నా తనువెగిసే
పరువపు వాన కురిసెలే
పరువము వెల్లివిరిసెలే
పేరెరుగని పక్షి పిలిచెలే
మనసు ఎగిసెలే
హృదయము హొయ్.. ముసిగా మురిసెలే
ఏ రోజైతే నువ్వు కనిపించవో
ఆ రోజు జీవితమే వ్యర్ధం
ఏ రోజైతే నువ్వు కనిపిస్తావో
ఆ రోజు చాలదాయే సమయం
రేయి పగలు ఒక మైకం
రేపింది యదలో తాపం
గుండెల్లో తియ్యని స్నేహం
విడిపోని అనురాగ బంధం
ఇది ఏనాడు వీడని బంధం
పేరెరుగని పక్షి పిలిచెలే
హృదయము హొయ్.. ముసిగా మురిసెలే







0 comments:
Post a Comment