Widgets

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ song from Bobbili Puli

జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ
ఏ తల్లి నిను కన్నదో.. ఏ తల్లి నిను కన్నదో
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ

నీ తల్లి మోసేది నవమాసాలేరా
ఈ తల్లి మోయాలి కడవరకురా
కట్టె కాలెవరకు.రా.
ఆ రుణం తల కొరివితో తీరేనురా
ఈ రుణం ఏ రూపాన తీరేదిరా
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి నువు మరో రూపు నువు రా
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ

గుండె గుండెకు తెలుసు గుండె భరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత భాదెంతొ
నీ గుండె రాయి కావాలి ఆ గుండెల్లొ ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషి
మారాలి నువు రాక్షసుడిగా
మనుషుల కోసం..  ఈ మనుషుల కోసం..  నీ మనుషుల కోసం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరియసీ స్వర్గాదపీగరియసీ
To listen this song click on play button

0 comments:

Post a Comment

LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory