Widgets


జిగిజిగిజిగిజా జాగేల వనజా song from Chettu Kinda Pleedaru

 

జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా

లాలి లాలి ప్రేమ రాని
అనురాగంలోనే సాగిపోని
మేనా లోనా చేరుకోని
సురభోగాలన్ని అందుకోని
పెదవి పెదవి కలవాలి
యదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి
మురళీ స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్యవీణ
ప్రేమావేశంలోనా
కౌగిలి విలువే వజ్రాల హారం
మోహావేశంలోనా
రావే రావే రసమందారమా
జిగిజిగిజిగిజా… జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
జిగిజిగి జిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
నాదేలే మమతల మణిహారం
నీదేలే వలపుల వైభోగం

స్నానాలాడే మోహనాంగి
ఇక సొంతం కావే శోభనాంగి
దూరాలన్ని తీరిపోని
రసతీరాలేవో చేరుకోని
తనువు తనువు కలిసాకా
వగలే ఒలికే శశిరేఖా
ఎగసే కెరటం యదలోనా
సరసం విరిసే సమయానా
ముందే నిలిచే ముత్యాలశాల
పువ్వే నవ్వే వేళా
రమ్మని పిలిచే రంత్నాల మేడా
సంధ్యారాగంలోనా
వలపే పలికే ఒక ఆలాపన
జిగిజిగిజిగిజా… జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
జిగిజిగిజిగిజా జాగేల వనజా
రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాలరాజా
నీదేరా ఈ రోజా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory