కళ్ళల్లొ కన్నీరొకటే మిగిలిదంటా ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయకే భామా భామా ప్రేమా గీమా వలదే (2)
నాటి వెన్నెల మళ్ళి రానేరాదు మనసులో వ్యధ ఇంక అణగదు
వలపు దేవిని మరువగ తరమా
ఆ..ఆ ఆమని ఎరుగని శూన్యవనమిది నీవే నేనని నువ్వు పలుకుగ
కోటి పువ్వులై విరిసెను మనసే
చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే
యదలోని బొమ్మ ఎదుటకు రాదే మరచిపోవే మనసా
ఓ.. ఓ వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా
కళ్ళల్లొ కన్నీరొకటే మిగిలిదంటా ఏనాడు రానంట నీ వెంట
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయకే భామా భామా ప్రేమా గీమా వలదే
చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కలగని
నూరు జన్మల వరమై నిలిచే.. ఓ చెలీ
ఒంటరి ఈ భ్రమ కల చెదిరిన ఉండునా ప్రేమ అని తెలిసిన
సర్వ నాడులు కృంగవ చెలియా
ఒక నిముషమైన నిను తలువకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా
మది మరిచిపోని మధురూహలనే మరచిపోవె మనసా
నా గతమంతా నే మరిచానే నే మరిచానే
నన్నింకా ఇంకా బాధించెయకే భామా భామా ప్రేమా గీమా వలదే







0 comments:
Post a Comment