కలహంసై కబురులే ఇవ్వనా రాచిలకై కిలకిల నవ్వనా
నా పెదవుల మధువులే ఇవ్వనా సయ్యాటలోనా
ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ప్రేమలో తీపి చూసే వయసే నీదిరా
బ్రతుకులో చేదులున్నా భయమే వద్దురా
సుడిగుండం కాదురా సుమగంధం ప్రేమరా
పెనుగండం కాదురా అనుబంధం ప్రేమరా
సిరి తాను తానై వచ్చి నిన్ను చేరునురా
ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా
ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా
ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
ఆశగా పల్లవించే పాటే నీవులే
జీవితం తోడులేని మోడేం కాదులే
కలిసుండే వేళలో కలతంటూ రాదులే
అమవాసై పోదులే అడియాశే కాదులే
చిరుదివ్యకాంతులింక దారి చూపునులే
ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా
మేఘాలకు నిచ్చనే వేయనా ఆకాశపుటంచులే పంచనా
ఆ జాబిలి కిందకే దించనా నా కన్నెకూనా
ఊహలపల్లకీలో ఊరేంగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా

0 comments:
Post a Comment