Widgets


సరిమమగరి ససనిదపస సరిమమగరి ససనిదపస song from Choodalani vundi

 

సరిమమగరి ససనిదపస
సరిమమగరి ససనిదపస
రిమగనిమప స సనిదపమగమగరి
యమహానగరి కలకత్తా పురి
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ

నేతాజి పుట్టినచోట గీతాంజలి పూసినచోట పాడనా తెలుగులో
ఆ హంస పాడిన పాటే ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం
బ్రతుకుతో వెయ్యి బంధం కడకు చేరాలి గమ్యం కదలి పోరా
ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజీ బిజీ బ్రతుకుల
గజి బిజి ఉరుకుల పరుగులలో

యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి

బెంగాలి కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మాలిని సరోజిని
రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ కింద సాగనీ
పదుగురు ప్రేమలేలేని లోకం దేవతామార్కు మైకం
శరన్నవలాభిషేకం తెలుసుకోరా కధలకు నెలవట కళలకు కొలువట
తిధులకు సెలవట అధిదుల గొడవట
కలకట నగరకు కిటకిటలో

యమహానగరి కలకత్తా పురి నమహొ హుగిలి హౌరా వారధీ
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి

వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే కీర్తిరా
మాతంగి కాళీ నిలయా చోరంగి రంగులదునియా నీదిరా
వినుగురు సత్యజిత్‌రే సితార యస్.డి.బర్మన్‌ గిటారా
ధెరీసాకి కుమారా కదలిరారా
జనగణమనముల స్వరపద వనముల
హృదయపు లయలను శృతి పరిచిన ప్రియా
సుఖపిక ముఖ సుఖ రవళులతో

యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
చిరుత్యాగరాజు నీకృతినే పలికెను మది
యమహానగరి కలకత్తా పురి
నమహొ హుగిలి హౌరా వారధీ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory