నువు లేక క్షణమైనా
కదలదు కాస్తైన ఈ కాలము
దొరికెను వరమల్లే నీ స్నేహము
ప్రియా ప్రియా నువ్వే లోకము, నాలో సగం జగం
కలనైనా ఇలనైనా…
మనసుపడే ఓ స్నేహమా.. చెప్పవే ప్రేమ సాగరమా
ఎగిసిపడే కెరటానికి.. తీరమై చేరనా
విరహపడే ఓ గగనమా.. మేఘమై వీడి వెళ్ళకుమా
చిలికిపడే ఈ చినుకుని.. సంద్రమై దాచనా
ఈ సమయం నీ ప్రణయం నను ఏదో ఏదో చేసే
ఈ తరుణం నా హృదయం చెలి నిన్నే నిన్నే కోరే
ఇది ఎంతటి అతిశయమో…
ప్రియ ఆశై శ్వాసై ధ్యాసై ఊసై ఉంటా ప్రతి క్షణము
కలనైనా ఇలనైనా..
కలిగెనులే సందేహము.. నేనే నేను కాదా అని
తెలిసెనులే ఓ సత్యము.. నాలో నువ్వు చేరావని
గడవదులే ఏ నిముషము.. ఇది ప్రేమో మాయో ఏమో
కలవరమై నా కళ్ళలో.. ఏవో కొంటె స్వప్నాలలో
గ్రహణాలే తొలగిస్తూ ఆ గగనాలే దాటొస్తా
చిరుమబ్బుల మీదుగా పగడపు దీవికి రెక్కల గుర్రం మీదన వచ్చి
నీ కలలన్నీ తీర్చే రాజుని నేనే నేనంటా
కలనైనా ఇలనైనా..







0 comments:
Post a Comment