Widgets


ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి song from DharmaChakram

 

ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి

వేసంగి మల్లెల్లో శీతంగి వెన్నెల్లో
వేసారిపోతున్నారా రారా
హేమంత మంచుల్లో ఏకాంత మంచంలో
వేటాడుకుంటున్నానే నిన్నే
మొటిమ రగులు సెగలో
తిరగబడి మడమ తగులు వగలో
చిగురు వణుకు చలిలో
మదనుడికి పొగరు పెరిగె పొదలో
గోరింట పొద్దుల్లోన పేరంటాలే ఆడే వేళ
ధీర సమీరే యమునా తీరే వలచితి నే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియ తగునా రసకేళి

లేలేత నీ అందం నా గీత గోవిందం
నా రాధ నీవేలేవే రావే
నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు
నా ఉట్టి కొట్టేస్తున్నా రావా
వయసు తెలిసె ఒడిలో
యద కరిగి తపన పెరుగు తడిలో
మనువు కుదిరె మదిలో
ఇంకిపుడు చనువు ముదురు గదిలో
వాలారు సందెల్లోన వయ్యారాలే తాకే వేళ

ధీర సమీరే యమునా తీరే వలచితి నే వనమాలి
ఆ.. గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియ తగునా రసకేళి
ఆకాశమే నా హద్దుగా నీ కోసమొచ్చా ముద్దుగా
తెచ్చానురా మెచ్చానురా గిచ్చేయి నచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి
గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రసకేళి
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory