Widgets


వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే song from Jodi

 


వెర్రి మనసా వేగిపోకే
విరహమంటే వెండి మంటే
నీ తోవకదె వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి
నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిందే గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది
చెలి చిలకా చెలి చిలకా
వింత పరుగులు చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో కొలువుండు కడవరకు
చెలి చిలకా చెలి చిలకా
వింత పరుగులు చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో కొలువుండు కడవరకు
వెర్రి మనసా వేగిపోకే

మాయదారి మంచు మంట ఆరిపోక
కోరుకున్న మల్లె బాట కంటపడక
కలలు ఎండిపోవాలా
వెన్నలంటె తెలియదు వేడి లేక
రాతిరంటె వేగు చుక్క పైడి బాట
ఆశ ఓడిపోదు అలలకి అలసట రాదు
విలవిలపించే ఈడుకి జతవై
చలువలు పంచే తొలివలపేమో
ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా
వెర్రి మనసా వేగిపోకే.. (||)

సులువుగ దొరకవు ఏ పెన్నిధులు
గనులను తవ్వక అందవు మణులు
గమ్యం మనకు ఎదురై రాదుగా
కురవక నిలవదు నింగి మేఘం
చినుకుతొ చెదరద మన్ను మౌనం
నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా
మనసును మీటే మాటే విన్నా
నిలవని అడుగుల బరువవుతున్నా
నూరేళ్ళ వరకు నీ తోడయ్యేందుకు

వెర్రి మనసా వేగిపోకే
నీ తోవకదె వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి
నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిందే గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది
చెలి చిలకా చెలి చిలకా
వింత పరుగులు చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో కొలువుండు కడవరకు
వెర్రి మనసా వేగిపోకే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory