నా మనసునిలా ముక్కలు చేశావే
నీ తలపులలో ముళ్ళే ఎన్నెన్నో… గాయం చేసే… ఇలా
నీ కలవరమే వెల్లువలా తాకే
ఈ కలయికలో వేదనలే చూపే
నా యద లయలో అలజడులే ఎన్నో… ప్రళయం రేపే… ఇలా
నీవే కోరి వెళుతున్న తీరం ఇదీ
నన్నే కమ్ముకుంటున్న శూన్యం ఇదీ
కలలా కలిసి గతమయ్యావే
జతగా నడిచి కథవయ్యావే
కలలా కలిసి గతమయ్యావే
జతగా నడిచి కథవయ్యావే
నా ప్రాణం నిన్నే కోరిందే చెలియా చెలియా… నిజమే కదటే
నీ వైపే అడుగులు వేస్తుందే చెబితే వినదే
ఈ నిమిషాన నా లోకం మారిందని… నమ్మాలా
నా హృదయాన నీ రూపం మరుగవదే…. ఏమైనా
కలలా కలిసి గతమయ్యావే
జతగా నడిచి కథవయ్యావే
కలలా కలిసి గతమయ్యావే
జతగా నడిచి కథవయ్యావే







0 comments:
Post a Comment