తెలుసుకో సుందరా నా మనసులో తొందర
మాట చాలు ఓ మాళవిక ఆగలేదు నా ప్రాణమిక
తెలుసులే అందమా నీ మనసులో సరిగమా
కలుపుకోవ నన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా
కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
ఏరి కోరి నీ యద పైన వాలిపోనిది వయసేనా
తేనెతీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా
నింగి జారి తళుకుల వాన కమ్ముకుంటే కాదనగలనా
అందమైన అద్భుతాన్నిలా దరికి పిలుచుకోనా
ఆడించు నన్ను పాడించు నన్ను నీ హాయి నీడలో
తెలుసులే అందమా నీ మనసులో సరిగమా
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
ఆడ మనసులో అభిలాష అచ్చ తెలుగులో చదివేసా
అదుపు దాటి వరదయింది ఈ చిలిపి చినుకు వరసా
నన్ను నేను నీకొదిలేసా ఆదమరపులో అడుగేసా
అసలు కొసరు కలిపి తీసుకో వలపు తలుపు తీర్చా
అనుకున్న కొన్ని అనలేనివన్ని ఆరాలు తియ్యనా ఆ
తెలుసులే అందామా నీ మనసులో సరిగమ
చూపు చాలు ఓ మన్మధుడా ఆగనంది నా గుండె దడ
తెలుసుకో సుందరా నా మనసులో తొందర
తెలుసుకో సుందరా నా మనసులో తొందర







0 comments:
Post a Comment