Widgets


చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా song from Neesneham

 

 చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా  మువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా  సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని సాస నిని దాద మామ గమదనిరిస గా నినిదగ నినిదగ నినిదగ నినిదగ  సగమగ సనిదని మద నిస నిస గసగా చరణం 1: పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ  పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు  కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ సగస మగస గమద నిదమ గమదనిసా సనిస సనిస నిస నిస నిస గమ రిస సనిస సనిస నిస నిస నిస గమ రిస గాగ నీని గగ నీని దగ నిగ సపా చరణం 2: వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతునవే కుందనాల బొమ్మ సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా ఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా  మువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవమ్మా 


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory