Widgets


ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా ఇది మౌనబాష మీటుతున్న వీణ song from Nireekshana

 

ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన
చిన్ని గుండెలో ఎన్నెన్ని ఆశలో
గొంతు విప్పి చెప్పలేని ఎన్ని మాటలో
రాతిరేళలో చురుక్కుమంటదో
మనస్సు లేని మనిషి నేను ఏమి చెయ్యను
ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన

నీ కంటీ చూపులే అలా అలా నన్ను తాకగా
నీ వెంట నేనిలా ప్రతీ క్షణం తోడు ఉండనా
దారి తప్పి తిరుగుతున్న బాటసారిని
పూల దారిలోకి నువ్వు నడిపినావని
జీవితానికర్ధమేంటొ తెలిపినావని
మనసు తెరిచి నన్ను నువ్వు గెలిచినావని
క్షమించమన్న అర్హతైన నాకు లేదని
ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన

ఈ చీకటెప్పుడు ఇలా ఇలాగె ఉండిపోదులే
నీ నవ్వు తాకితే సరాసరి వెన్నెలవునులే
పంజారాన చిక్కుకున్న చిలక నీవని
బాధపడుతు కూర్చునుంటే లాభమేంటని
వేటగాడి తోటి చెలిమి చేసినావని
తప్పు తెలుసుకున్నవాడే మనిషి అవునని
నీ మాట కోరి పొందినాను కొత్త జన్మని

ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న వీణ
ఎవరెంత ఆపినా కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న వాన
చిన్ని గుండెలో ఎన్నెన్ని ఆశలో
గొంతు విప్పి చెప్పలేని ఎన్ని మాటలో
రాతిరేళలో చురుక్కుమంటదో
మనస్సు లేని మనిషి నేను ఏమి చెయ్యను
ఒకమాట చెప్పనా ఒకపాట పాడనా
ఇది మౌనబాష మీటుతున్న…
ఎవరెంత ఆపినా కన్నీరు ఆగునా
ఇది కంటిపాప చల్లుతున్న లాలన



0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory