మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే
నిను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని.. అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
నిన్ను చూడంది పదే పదే పడే యాతన
తోట పూలన్నీ కని విని పడేను వేదన
నువ్వు రాకుంటే మహాశాయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలిచి అలసి నీ రాక కోసం
వేచిఉన్న ఈ మనసుని అలుసుగ చూడకని.. అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే
పెళ్ళి చూపుల్లో నిలేసినా కథేంటో మరి
జ్ఞాపకాలల్లో చలేసినా జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీక్షణం యుగాలయ్యినా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
యదటో నుదుటో ఎచటో మజిలీ నీ మీద ప్రాణం
నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని.. అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే







0 comments:
Post a Comment