నా మరో రూపం నువ్వే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
పిల్చిన వెంటనే వెంటనే వచ్చేయనా
సులువుగ సంచి లో స్వర్గమే తెచ్చేయనా
మనసుని మంచు లో ముంచి నీకిచ్చేస్తున్న ఇచేస్తున్న
ఓ అమ్మడు ఓ అమ్మడు ఆకాశంలో నీ బొమ్మను ఈ క్షణము గీస్తానమ్మో
ఏం నమ్మకు ఏం నమ్మకు పాపాయమ్మో
నీ చెవులలో పువ్వులు పెడుతున్నాడే
నా మహారాణి నువ్వే చిలిపిగ చెప్పిందల్లా చేస్తానే
నా మరో రూపం నువ్వే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
జాబిలినే గుంజేసి వెన్నెలనే పిండేసి దానితో నీ కాళ్ళే కడిగేస్తా
కోకిలనే పట్టేసి నీ గదిలో పెట్టేసి రోజంతా పాటలు పాడిస్తా
ఒట్టే ఒట్టే నీ కోసం ఎమైనా చెస్తానే
పుట్టుమచ్చై నిన్నంటి ఎన్నాళ్ళైనా వుంటానమ్మా
ఓ అమ్మడు ఓ అమ్మడు అందిస్తానే నీ వలపు కోవెలగా హిందుస్తానే
రీల్ కొట్టుడు రీల్ కొట్టుడు మొదలెట్టాడే
రేపటికి నిన్నొదిలి జంప్ అవుతాడే
గుండెనిలా చెక్కేసి గుండ్రముగా చేసేసి బంతి వలె నీకే అందిస్తా
ఊపిరినే పోజేసి గంధముతో నింపేసి నిద్దురలో నీపై చల్లేస్తా
అంతే అంతే నువ్వంటే పిచ్చెక్కి ఉన్నానే
ఓకె అంటే వెర్రెక్కి గల్లీ గల్లీ దొల్లేస్తానే
ఓ అమ్మడు ఓ అమ్మడు ఊ అంటావా నీకిప్పుడు రాసిద్దును ఊటీనైనా
సోప్ ఎయ్యకు సోప్ ఎయ్యకు ఓ చెడ్డోడా ఫ్లాట్ అవ్వకు చీట్ అవ్వకు ఓ చంటమ్మా
నా మహారాణి నువ్వే చిలిపిగ చెప్పిందల్లా చేస్తానే
నా జతై రావే రావే నిలబడి నిన్నే నిన్నే మోస్తానే
నిదురలో నీ కల మేకులా గుచ్చిందే నిజముగ నిన్ను నా జంటగా తెచ్చిందే
మెలకువలో ఇలా నీ వల నన్నే నన్నే చుట్టేసిందే
ఏం చెప్పిన ఏం చెప్పిన వినలేదయ్యో మేమెంతగ పోరెట్టిన పోతోందయ్యో
ఈ పిల్లకి ఏ మంతరమేసాడయ్యో మేం వద్దని నీ ముద్దుని అడిగిందయ్యో







0 comments:
Post a Comment