Widgets


పుణ్యభూమి నా దేశం నమో నమామీ song from Major Chandrakanth


పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ (2)
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం …. నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ

అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే … ఆఆ..
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు..

అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన..(2)
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు…
నారు పోసావా.. నీరు పెట్టావా.. కోత కోసావా కుప్ప నుల్చావా..
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా..
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి,,
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు కన్న భూమి ఒడిలోనే ఒదిగాడు..

పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
ఎవడు రా నా భరత జాతిని తత్వమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచిన దమ్ములెవడికి వచ్చరా…
బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే ఆ చండ్ర నిప్పుల తండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా..
అన్న ఆ మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెత్తి
మర ఫిరంగులెక్కు పెట్టి వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం..

ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి..
అఖండ భరత జాతి కన్న మరో శివాజి..
సాయుధ సంగ్రామమే న్యాయమని..
స్వతంత్ర భారతావని మన స్వర్గమని..
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్.. (2)
గాంధీజి కలలు కన్న స్వరాజ్యం..
సాదించే సమరం లో అమర జ్యొతులై వెలిగే
ద్రువతారలు కన్నది ఈ దేశం,,
చరితార్దులకన్నది నా భారత దేశం.. నా దేశం



పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ,
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory