
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
నిన్నిలా చేరే దాకా ఎన్నడు నిదురే రాకా
కమ్మని కలలో ఐనా నినుచూడలేదే
నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడు ఇంకా
రెప్ప పాటైనా లేకా చూడాలనుంది
నా కోసమా అన్వేషణ నీడల్లే వెంట ఉండగా
కాసేపిలా కవ్వించనా నీ మధుర స్వప్నమై ఇలా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
కంట తడి నాడు నేడు చెంప తడి నిన్నే చూడు
చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా
చేదు ఎడబాటే తేలి తీపి చిరునవ్వే చేరి
అమృతం ఐపోలేదా ఆవేదనంతా
ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా
ఈనాడిలా ఈ పరిచయం అడిగింది కాస్త కొంటెగా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా
కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం
అటు ఇటు తిరుగుతు అలసిన మనసుకు చంద్రోదయం
రెండు కలిసీ ఒకసారే ఎదురయ్యే వరమా
ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా (3)







0 comments:
Post a Comment