Widgets


చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే song from Nenu

చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే
ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే
నిద్దర్లో నడక ఇదేమో నిన్నే నువు వెతికావేమొ
తెలుసా ఓ మనసా నీకైనా
మబ్బుల్లో తెగ ఎగిరావో మైకం లో మునిగున్నావో
చెప్పారా నీ తోటి ఎవరైనా ఎవరైనా
ప్రేమా ఒ ప్రేమా చూపావే నీ మహిమా
ప్రేమా ఒ ప్రేమా నిన్నాపేదెవరమ్మా ఓ ఓ ఓ
చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే
ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే

తలపుల్లో జడివానలకు తలపై ఎందుకు ఈ గొడుగు
చెలియా నీ మెత్తని అడుగు నా గుండెల్లొ చలి పిడుగు
ప్రతి నిజము కలలానే వుందీ అంది మెలుకొనే కలలు కనే నయనం
నా చుట్టూ లోకం ఎమైందీ అందీ ప్రతి చొటా నిను చూపే హృదయం
ఓ చూపుల్లో నిన్నే నిలిపి ఊహ కి నీ దారే తెలిపి పద పదమని పరిగెత్తిస్తున్నా
నా పేరు ని నేనే చెరిపి నా ఆశను నేలొ కలిపి నీకొసం పడి చస్తూఉన్నా
ప్రేమా ఒ ప్రేమా చూపావే నీ మహిమా
ప్రేమా ఒ ప్రేమా నిన్నాపేదెవరమ్మా ఓ ఓ ఓ
చూస్తూ చూస్తూనే ఏదో చిత్రం జరిగిందే
ఏమొ ఏమైందో ఏమి అర్దం కాకుందే

నువ్వొచ్చీ నేర్పే వరకు పాదాలకు తెలియదు పరుగు
నువ్వించిందే ఈ వెలుగు ఇన్నాళ్ళకు నా కన్నులకు – 2
నాక్కూడా కన్నీరొస్తుందీ అంది నా చెంపను నిమిరే నీ స్నేహం
బతకటమూ బాగానే వుందీ అందీ నీ జతలో నవ్వే నా ప్రాణం
శ్వాస కి ఈ పూల సుగంధం పెదవికి చిరునవ్వుల అర్దం నీ చెలిమే తెలిపిందనుకోనా
సరికొత్తగ నీ అనుబంధం స్రుష్టించిన నా ఈ జన్మం నీ దరినే జీవిస్తూ వున్నా
ప్రేమా ఒ ప్రేమా చూపావే నీ మహిమా
ప్రేమా ఒ ప్రేమా నిన్నాపేదెవరమ్మా ఓ ఓ ఓ


0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory