సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి రావే రసమాధురి
వన్నె చిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కలనుంచి ఇల చేరి కనిపించు ఓసారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు
పాల చెక్కిళ్ళు దీపాల పుట్టిల్లు
అదిరేటి అధరాలు హరివిల్లులు
పక్కున చిందిన నవ్వులలో
లెక్కకు అందని రతనాలు
యతికైన మతిపోయే ప్రతి భంగిమా
యదలోనే పురి విప్పి ఆడింది వయ్యారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్ళు
నీలి కన్నుల్లు నా పాలి సంకెళ్ళు
నను చూసి వల వేసి మెలి వెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు
శ్వాసకు నేర్పెను సరిగమలు
కలగంటి తెలుగింటి కరకంటిని
కొలువుంటే చాలంట నా కంట సుకుమారి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి
సౌందర్యలహరి స్వప్నసుందరి నువ్వే నా ఊపిరి

0 comments:
Post a Comment